Monday, May 6, 2024

వివాహ‌బంధంతో ఒక్క‌టైన – ఇండియా అబ్బాయి-జ‌ర్మ‌నీ అమ్మాయి

వీరి ప్రేమ దేశాలు దాటింది. దాంతో ఇండియా అబ్బాయి, జ‌ర్మ‌నీ అమ్మాయి వివాహ‌బంధంతో ఒక్క‌టైయ్యారు..వివ‌రాలు చూస్తే..
రాజస్థాన్‌లోని పుష్కర్‌లో నివాసముంటున్న సాగర్ గుర్జర్ చదువు కోసం జర్మనీ వెళ్లాడు. సాగ‌ర్ గుర్జ‌ర్ ,మెలిని అనే అమ్మాయిని జర్మనీలో కలిశాడు. ఇద్దరు స్నేహితులుగా మారారు . ఆ త‌ర్వాత వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి పుష్కర్‌లో హిందూ వేడుకను కూడా ఏర్పాటు చేశారు. కాగా వీరి వివాహం పుష్క‌ర్ లోని ఓ హోట‌ల్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. భార‌త సంస్కృతి అంటే ఇష్టమని, ఇప్పుడు తాను హిందీ నేర్చుకుంటున్నానని మెలిని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement