Wednesday, April 24, 2024

Breaking: ‘గాంధారి’గా కీర్తి సురేశ్.. రేపే విడుదల

మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకున్న‌కీర్తి సురేష్ ఆత‌ర్వాత అదే రేంజ్‌లో హిట్‌లు రావ‌డం లేదు. ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌ కూడా చేస్తోంది. అంతేకాక ఎవరూ చేయని క్యారెక్ట‌ర్లు కూడా చేస్తోంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలామంది చేయరు. కానీ కీర్తి ఒకపక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క స్టార్ హీరోలకి చెల్లి పాత్రలు కూడా చేస్తోంది. ఇలా అన్నిరకాల పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉంది కీర్తి సురేష్.

తాజాగా కీర్తి ‘గాంధారి’ అనే ఒక మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌లో నటించింది. దీ రూట్‌, సోనీ మ్యూజిక్‌ సౌత్‌ సంస్థలు కలిసి గాంధారి అనే మ్యూజిక్ ఆల్బమ్ ని నిర్మించాయి. ఇందులో ‘గాంధారి’ టైటిల్ క్యారెక్టర్ లో కీర్తి సురేష్ డ్యాన్స్ చేసింది. ఈ ‘గాంధారి’ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘గాంధారి’ మ్యూజిక్‌ ఆల్బమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కీర్తి చేతికి గోరింటాకుతో, సంప్రదాయ దుస్తుల్లో డ్యాన్స్ చేస్తూ ఉన్న స్టైల్ లో ఉంది. ‘లవ్‌స్టోరీ’ సినిమా సంగీత దర్శకుడు పవన్‌ దీనికి సంగీతం అందించారు. బృందా మాస్టర్‌ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement