Wednesday, May 8, 2024

గ‌ని రిలీజ్ – రెండు డేట్స్ లో ఏది ఫిక్సో

క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో పెద్ద చిత్రాలు ఒక్కొక్క‌టిగా రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్, ఆచార్య‌, భీమ్లా నాయ‌క్ చిత్రాలు రిలీజ్ డేట్ ని వెల్ల‌డించాయి. తాజాగా వరుణ్ తేజ్ మూవీ ‘గనీ’ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం విడుదలపై క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న ఈ సినిమాను విడుదల చేస్తామని రెండు డేట్లు ప్రకటించారు. అయితే గతేడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన గని మూవీ లాస్ట్ మినిట్ లో వాయిదా పడింది. వరుసగా క్రేజీ సినిమాల డేట్స్ ప్రకటిస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement