Saturday, April 27, 2024

Fun Day: ‘క్రువెల్లా’ గురించి తెలుసుకుందాం..

ఈ సంవత్సరం మే నెలలో రిలీజైన ఈ మూవీని తెలుగులో డబ్ చేసి హాట్ స్టార్ లో వదిలారు. ఎమ్మాస్టోన్ లీడ్ రోల్ లో చేసిన ఈ క్రువెల్లా క్యారెక్టర్ ని డోడీ స్మిత్ రాసిన ‘‘101 డాల్మేషన్స్’’ అనే నవలను బేస్ చేసుకుని సాగుతుంది. ఈ క్రైమ్ కామెడీ ఫిల్మ్ చూడ్డానికి చాలా ఢిపరెంట్ గా ఉంటుంది.

స్టోరీ 1970’s  బ్యాక్స్ డ్రాప్ లో ఉంటుంది. ఒక యాస్పరింగ్ ఫ్యాషన్ డిజైనర్ అనే ఎస్టెల్లా.. నటోరియస్, డేంజరస్ క్రిమినల్ అయిన క్రుయెల్లాగా ఎలా మారింది అనేది మూవీ థీమ్. ఫ్రమ్ ద బిగినింగ్ మూవీ స్టైలే డిఫరెంట్ గా ఉంటూ వీక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

1970లలో స్టైల్ కి, మోడలింగ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ఈ సినిమాలో చూడొచ్చు. అస్టెల్లా క్రువెల్లాగా చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటీ.. తను ఒక రిమార్కబుల్ ఫ్యాషన్ డిజనర్ గా ఎలా ఎదిగింది.. అనే ఎలిమెంట్స్ ని వేరీ  ఎంగేజింగ్ మ్యానర్ లో ప్రెసెంట్ చేశారు.

ఎమ్మాస్టోన్ స్ర్కీన్ ప్రెసెన్స్ అయితే చూడ్డానికి స్టన్నింగ్ గా, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక 1970 టైమ్ నాటి పిక్చరైజేషన్ తో మధ్య మధ్యలో కామెడీ అండ్ ఆసమ్ సౌండ్ ట్రాక్ తో మూవీ ఆర్టిస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది చూసి ఎంజాయ్ చేయండి..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement