Sunday, April 28, 2024

అలర్ట్: ఈ పని చేయకపోతే రూ.10వేలు జరిమానా

పాన్ కార్డు వినియోగ‌దారులకు ముఖ్య గమనిక. పాన్ కార్డుకు ఆధార్ లింక్ మ‌రికొద్ది రోజులు గ‌డువే ఉంది. మార్చి 31 లోగా ఈ పని పూర్తి చేయకపోతే రూ.10వేలు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పాన్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాల‌ని గత ఏడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 31, 2021లోగా లింక్ చేయాల‌ని గ‌డువు ఇచ్చింది. ఒక‌వేళ గ‌డువులోగా లింక్ చేయ‌క‌పోతే ఏప్రిల్‌ 1,2021 నుంచి పాన్‌ చెల్లకుండా పోతుంది. దీంతో పాటు పాన్ కార్డు వినియోగ‌దారుడి నుంచి రూ.10వేల వరకూ జరిమానాను విధించే అవ‌కాశం ఉంద‌ని అప్ప‌టి నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించింది. ఆర్థిక లావాదేవీల‌కు ఇప్పుడు పాన్ అత్యంత ముఖ్య‌మైన‌దిగా మారింది. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల‌న్నా, క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవాల‌న్నా, మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్ల‌లో ఇన్వెస్ట్ చేయాల‌న్నా ఈ నెంబ‌ర్ న‌మోదు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేశారు. అలాగే బ్యాంకుల్లో రూ.50 వేల డ‌బ్బును జ‌మ చేయాల‌న్నా పాన్ నెంబ‌ర్‌ తప్పనిసరి. మార్చి 31లోపు ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే.. ప్ర‌స్తుత‌ పాన్‌ చెల్లుబాటు కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement