Wednesday, May 1, 2024

స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలి : పవన్

‌విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. అటు అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు కూడా స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంపై స్పందించారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ఆందోళనల మధ్య ఆ కార్పొరేషన్‌ ను గెలుచుకున్న వైసీపీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. మరింత బాధ్యతతో వైసీపీ… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్టీల్‌ ప్లాంటు సమస్యపై మాట్లాడాలని… అక్కడ జరుగుతున్న ఆందోళనలు-భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల ఇబ్బందులపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. 22 మంది ఎంపీలున్న వైసీపీనే..ఢిల్లీలో ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement