Sunday, May 19, 2024

Kolkata: గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 12 గంటలైన అదుపులోకి రాని మంటలు

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాంగ్రా ప్రాంతంలోని మెహర్ అలీ లేన్‌లోని గోడౌన్‌లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది 12 గంటల తర్వాత కూడా పూర్తిగా ఆరిపోలేదు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది 12 గంటలుగా శ్రమిస్తున్నారు. అయినా ఈ మంటలు అదుపులోకి రావడం లేదు. మంటలు ఆర్పేందుకు 15 ఫైరింజన్లు ఉపయోగిస్తున్నారు. గోడౌన్‌లో కొన్ని ప్రాంతాల్లో మంటలు పూర్తిగా అదుపు చేశారు. గొడౌన్‌లో మండే పదార్థాలు ఉండడం వల్లే.. అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement