Thursday, May 2, 2024

పెట్రోల్ బైక్ ని – ఎల‌క్ట్రిక్ బైక్ గా మార్చిన రైతు

పెట్రోల్ బైక్ ని.. ఎల‌క్ట్రిక్ బైక్ గా మార్చాడు ఓ వ్య‌క్తి. లాక్ డౌన్ స‌మ‌యంలో రెండు సంవ‌త్స‌రాల పాటు క‌ష్ట‌ప‌డి అనుకున్న‌ది సాధించాడు. బైక్‌కు 750 వోల్ట్ సామర్థ్యం ఉన్న మోటారు, 48 వోల్టుల బ్యాటరీ, చార్జర్, కంట్రోలర్, లైటు, ఎలక్ట్రిక్ బ్రేకు విజయవంతంగా అమర్చాడు. బ్యాటరీని నాలుగు గంటలపాటు చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించేలా తీర్చిదిద్దాడు. పెట్రోలు బైకును.. పూర్తి విద్యుత్ బైక్‌గా మార్చేందుకు రూ. 40 వేలు ఖర్చు చేశాడు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ధ్యానేశ్వర్ చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సహకారం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ధ్యానేశ్వర్ వెల్ల‌డించాడు. మహారాష్ట్రకు చెందిన రైతు ధ్యానేశ్వ‌ర్ అవసరం.. అతడిని ఆవిష్కరణల దిశగా పురికొల్పింది. తాను పండించే పూలను మార్కెట్‌కు తరలించేందుకు ప్రతి రోజూ రూ. 250 ఖర్చవుతుండగా దానిని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన పెట్రోలు బైకును, ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పని ప్రారంభించాడు. రెండేళ్లపాటు కష్టనష్టాలు భరించి ఎట్టకేలకు విజయం సాధించాడు. ఇప్పుడతడు రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్‌పై 14 రూపాయల ఖర్చుతో ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చ‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement