Tuesday, April 30, 2024

Exclusivi – కబ్జాల మర్రి …. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి లీలలు

చిన్నదామెర చెరువు చెరపై ఆరా
మాజీ మంత్రి అల్లుడు మర్రి లీలలు అన్నీ ఇన్నీ కావు
ఫుల్‌ ట్యాంక్ లెవల్‌లో 5.01 ఎకరాల కబ్జా
బఫర్‌లో మరో 3.23 ఎకరాల ఆక్రమణ
షెడ్లు, పార్కింగ్‌, శాశ్వత నిర్మాణాలు
2007లో హైకోర్టులో కేసు, న్యాయ విచారణ
సంయుక్త కమిటీ ఏర్పాటు, తాజాగా తనిఖీలు
కాలేజీల భవనాలు ఏకంగా చెరువులోనే నిర్మాణం
గుర్తించిన అధికారులు, నిపుణుల బృందం
క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో త‌నిఖీ చేప‌ట్టిన అధికారులు
క‌బ్జా నిజ‌మేన‌ని తేల్చిన నిపుణుల క‌మిటీ
చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డి

మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని చిన్నదామెర చెరువు ఆక్రమణకు గురైందని కొందరు వ్యక్తులు వేసిన కేసును హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. హైదరాబాద్‌ మహా నగరంలో ఉనికి కోల్పోతున్న 13 చెరువులు, కుంటల కబ్జాలపై.. ప్రత్యేక న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.. అందులో భాగంగా న్యాయ నిపుణుల బృందం జాయింట్‌ కమిటీ (రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌) శాఖలతో మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ గండిమైసమ్మ (గ్రామం, మండలం)లోని చిన్నదామెర చెరువు (లేక్‌ఐడీ- 2811) చెరువును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ- సోలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రవీణ్‌ కుమార్‌, గవర్నమెంట్‌ ప్లీడర్‌ శ్రీకాంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో చిన్నదామెర చెరువు (లేక్‌ఐడీ- 2811) పరిశీలించి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుత మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఐఏఆర్‌ఈ అండ్‌ ఎంఎల్‌ ఆర్‌ఐటీఎం రెండు ఇంజనీరింగ్‌ కళాశాలలకు చెందిన శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు అక్ర మంగా చిన్నదామెర చెరువులో నిర్మించినట్లు రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులు నిపుణుల బృందం గుర్తించింది.

చిన్నదామెర చెరువులో మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆక్రమించిన స్థలం మొత్తం 5-01 ఎకరాల ఎఫ్‌టీఎల్‌, 3-23 ఎకరాల బఫర్‌గా తేల్చారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యామ్‌ ప్రకాష్‌, ఏడీ బుచ్చిరెడ్డి, డీఐ గంగాధర్‌, దుండిగల్‌ గండిమైసమ్మ తహసీ ల్దార్‌ సయ్యద్‌ మతీన్‌ , ఆర్‌ఐ భారతి సర్వేయర్‌, సునీత ఇరిగేషన్‌ డీఈఈ శ్రీనివాస్‌, ఏఈఈ సారా, దుండిగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ, ఇన్‌చార్జి టౌన్‌ప్లానింగ్‌ అధికారి సాయిబాబా పాల్గొన్నారు.

దుండిగల్‌ మున్సిపల్‌ పరిధిలోని చిన్నదామెర చెరువు సర్వే నెంబర్‌ 405తోపాటు- 484 – 483 – 486 – 488 – 489 – 492లలో మొత్తంగా 148ఎకరాల్లో విస్తరించి ఉంది. దుండి గల్‌ ఔటర్‌ రింగురోడ్డు నిర్మాణం కూడా చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌లోనే జరిగింది. చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్‌ కో-ఆర్డినేట్స్‌ను పరిశీలిస్తే ఈ అంశం ధృవీకరించ బడుతుంది. అయితే చిన్నదామెర చెరువును ఆనుకునే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల.. మర్రి లక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ -టె-క్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలు ఉన్నాయి.

గత ప్రభు త్వంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకుని మర్రి రాజశేఖర్‌రెడ్డి విచ్చలవిడిగా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ను ఆక్రమించి గ్రామ పంచా యతీ అనుమతులతో శాశ్వత భవనాలు, రేకుల షెడ్లు, బస్సులు పార్కింగ్‌ చేసేందుకు స్థలాన్ని మట్టితో నింపి ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ను ఆక్రమించేశాడు. ఇది చాలదన్నట్లు దుండిగల్‌ తాండా-1లోని కుమ్మరికుంట నుండి దుండిగల్‌ లోని చిన్న దామెర చెరువుకు వచ్చే కట్టుకాలువలను సైతం పూడ్చేశారు. ఫలితంగా పైప్రాంతమైన కుమ్మరికుంట నుండి కింది ప్రాంతమైన చిన్నదామెర చెరువుకు వరదనీరు రాకుండా పోతుంది. దీని వల్ల చెరువు పూర్తిస్థాయిలో నిండేందుకు అవకాశం లేకుండా పోయింది.

- Advertisement -

దుండిగల్‌ గ్రామ పంచాయతీ పాలనలోనే మర్రి రాజశేఖర్‌రెడ్డి తన వ్యూహాన్ని అమలుపరిచి ఎఫ్‌టీఎల్‌, బఫర్లలో నిర్మాణాలకు అనుమతులు పొందారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌లోకి వస్తున్న సర్వేనెంబర్లలో నిర్మించిన శాశ్వత నిర్మాణాలతోపాటు తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించి స్థలాన్ని సైతం అగ్రికల్చరల్‌ టు నాన్‌ అగ్రికల్చరల్‌గా (నాలా కన్వర్షన్‌) మార్చుకున్నారు. వాస్తవానికి నాలా కన్వర్షన్‌ చేసే సమయంలో రెవెన్యూ అధికారులు సంబంధిత స్థలాన్ని పక్కాగా పరిశీలించారు. ఇక్కడ మాత్రం డబ్బు చేతులు మారిందని ఫలితంగా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌లోకి వచ్చిన స్థలాన్ని సైతం నాలా కన్వర్షన్‌ చేశార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కన్వర్షన్‌ పూర్తయ్యాక నిర్మించిన నిర్మాణాలకు ఆస్తి పన్ను చెల్లింపు ఇలా ప్ర తీదీ పక్కాగా చేసుకున్న రాజశేఖర్‌రెడ్డి భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడ్డారు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, మర్రి లక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ -టె-క్నాలజీ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలల నిర్మాణం నుండే చిన్న దామెర చెరువు ఆక్రమణకు గురవుతుందనే ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ నయానో భయానో మర్రి రాజశేఖర్‌రెడ్డి తొక్కిపెట్టి వాటిని ప్రచారం కాకుండా చూశారు. ఫిర్యాదు లొచ్చినా వాటిని తొక్కిపెట్టేం దుకు ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్‌, గ్రామ పంచాయతీ, మున్సిపల్‌గా అవతరించిన తొలినాళ్లలోని సిబ్బందిని మర్రి మచ్చిక చేసుకుని తనకు ఎదురు లేదన్నట్లుగా వ్యవ హరించారు. అయితే 2007లో హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించి తిరిగి విచారణ జరగడం, డిప్యూటీ- సోలి సిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వ ర్యంలో జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించడంతో మర్రి చెరువు కబ్జాల పరంపర మరోమారు వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి జ్యుడీ షియల్‌ విచారణ ప్రారంభం కావడంతో చిన్న దామెర చెరువు కబ్జాలపై చర్యలుంటాయో లేదో వేచిచూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement