Sunday, April 28, 2024

అన్నమయ్య కీర్తనలు : తలమేల కులమేల

రాగం : సావేరి

తలమేల కులమేల తపమే కారణము
యెలమి హరిదాసులు యేజాతియైన నేమి || ||తలమేల కులమేల ||

కాకమువల్ల బుట్టదా ఘనమైన యశ్వత్థము
దాకొని గుల్లలో బుట్ట దా ముత్తెము
చౌకైన విషలతనె జన్మించదా నిర్విషము
యే కడ మహానుభావు లెం దు పుట్టిరేమి || ||తలమేల కులమేల ||

చిడిపిరాళ్ల బుట్టనా చెలుపైన వజ్రములు
పుడమి నీగల వల్ల బుట్టదా తేనె
వెడగు బిల్లి మేనను వెళ్ళదాయనా జవ్వాది
వుడివోని పుణ్యులెందు నుదయించి రేమి || ||తలమేల కులమేల ||

పంకములో బుట్టదా పరిమళపు దామెర
పొంకపు గీటములందు పుట్దా పట్టు
కొంకక శ్రీ వేంకటేశు గొలిచిన దాసులు
సంకెలేని జ్‌ఆను లెందు జనియించి రేమి || ||తలమేల కులమేల ||

Advertisement

తాజా వార్తలు

Advertisement