Friday, May 17, 2024

MDK : బ్రహ్మోత్సవాలకు రండీ.. హరీష్​రావుకు ఆహ్వానం

గజ్వేల్, ఏప్రిల్ 30 (ప్రభన్యూస్) : గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక ను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని పురాతన సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేటినుండి ప్రారంభం కానున్న సందర్బంగా ఈ బ్రహ్మోత్సవాలకు తప్పకుండా హాజరవుతానని హరీష్ రావు పేర్కొన్నారని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు కళ్యాణ్ కర్ నర్సింగ రావు, సుంకరి బాలకుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement