Saturday, April 27, 2024

లైంగిక వేధింపుల నుంచి త‌ప్పించుకునేందుకు – 30ఏళ్లు మ‌గ‌వేషంలో మ‌హిళ‌

ఆడ‌వారికి ఎక్క‌డికి వెళ్లినా లైంగిక‌వేధింపులు త‌ప్ప‌వనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే ఈ వేధింపుల నుండి త‌ప్పించుకోవ‌డానికి ఒక మ‌హిళ మ‌గ‌వాడిలా మారింది. ఏకంగా 30సంవ‌త్స‌రాలు అదే వేషాన్ని కంటిన్యూ చేయ‌డం విశేషం. వివ‌రాలు చూస్తే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్‌ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింపులు ఎదురయ్యాయి.దీంతో ఒంటరి మహిళగా ఉన్న తాను ఈ వేధింపుల నుంచి తప్పించుకోవడంతో పాటు బిడ్డను అన్ని సౌకర్యాలతో పెంచుకునేందుకు జుట్టు కత్తిరించి, లుంగీ కట్టి 30 ఏండ్ల పాటు పూర్తిగా మగ వ్యక్తి వేషంలోకి మారిపోయింది. ‘ముత్తు’గా మారి మూడు దశాబ్దాలుగా పెయింటర్‌, వంట మాస్టర్‌ వంటి పనులు చేసింది. కూతురికి పెండ్లి చేసి అత్తారింటికి పంపింది.దాంతో ఇప్పుడు ఈమె వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement