Thursday, April 25, 2024

నా హత్యకు కుట్ర‌: ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

తన ప్రాణాలకు ముప్పు ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. తనను చంపే కుట్రలో పాల్గొన్న వారందరి పేర్లను వీడియో రికార్డ్ చేసినట్లు చెప్పారు. సియాల్‌కోట్‌లో జరిగిన పార్టీ భారీ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర గురించి నాకు తెలుసు అని అన్నారు. తాను ఒక వీడియోను రికార్డ్ చేసి సురక్షితమైన స్థలంలో ఉంచానని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే ఆ వీడియో దేశం ముందు బహిర్గతం అవుతుందన్నారు. అందులో తనపై ఎవరు కుట్ర పన్నారో, ఎవరెవరు సహకరించారో, అందరి పేర్లు పెట్టానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement