Monday, May 6, 2024

కన్నెర్ర చేశారు – అకౌంట్ లో వేతనాలు పడ్డాయి

ముత్తుకూరు ( ప్రభ న్యూస్) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీజెన్ కో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రం లో పనిచేస్తున్న ఇంజనీర్లుతోపాటు ఉద్యోగస్తులు జనవరి నెల వేతనం చెల్లించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు పరిపాలన భవనం వద్ద సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గుమ్మడి శ్రీనివాసులు, కృష్ణ చైతన్య, సుధాకర్ లు ఆధ్వర్యంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం ఫలితంగా వందలాది మంది ఇంజనీర్లు ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రాష్ట్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు వేతనాలు క్రెడిట్ చేశారు.

ఇంజనీర్లు ఉద్యోగుల సంబంధించిన చరవాణిలకు వేతనాలు చెల్లించినట్లు మెసేజ్ రూపంలో సమాచారం అందడంతో ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జెన్కో బ్రాంచ్ హర్షం వ్యక్తం చేసింది. సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్న సమయంలోనే ఈ సమాచారం చరవాణి ల ద్వారా అందింది. దీంతో ఏపీ జెన్కో ఉద్యోగస్తులు ఇంజనీర్లు సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేశారు. తదుపరి పరిపాలన భవనం వెలుపలకు వచ్చి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. విద్యుత్ ఉద్యోగస్తులు ఇంజనీర్లు ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. వేతనాలు చెల్లించి నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే యధావిధిగా భోజన విరామ సమయంలో ఏపీ జెన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని నిరసన మాత్రం కొనసాగుతుందని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement