Friday, April 26, 2024

సీఎం జ‌గ‌న్ ని ఇప్ప‌ట్లో క‌లిసే ఛాన్స్ లేదు – ఎమ్మెల్యే, హీరో బాల‌కృష్ణ‌

తాను సీఎం జ‌గ‌న్ ని క‌ల‌వ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్యే,న‌టుడు బాల‌కృష్ణ‌. ఇప్పట్లో ఆయనను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను కలవడానికి రావాలని తనను పిలిచారని… అయినా తాను వెళ్లలేదని చెప్పారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే తన తాజా చిత్రం ‘అఖండ’ ఘన విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టిందని తెలిపారు. తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయని, టికెట్ ధరలు తన చిత్రాలపై ప్రభావం చూపబోవని అన్నారు. తన సినిమాల బడ్జెట్ ను తాను పెంచనని చెప్పారు. కొన్నిరోజుల క్రితం జగన్ ను చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కలిసిన సంగతి తెలిసిందే. ఈరోజు సీఎంతో మంచు విష్ణు భేటీ అయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement