Thursday, May 2, 2024

తెలంగాణ వృద్ధి రేటు అదిరింది.. కేంద్రమే ప్రకటించిందన్న మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజకీయ కుట్రలను ఎదుర్కొంటూ,రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగుతోందన్నారు. నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ ఆదర్శ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తూ, దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలిచిందనడానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలే నిదర్శనం అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు తీస్తోందన్నారు. 2021-22లో తలసరి ఆదాయంలో 19.10% వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. జీఎస్డీపీలోనూ 19.46% వృద్ధిరేటును నమోదు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ వివరాలు ప్రకటించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement