Saturday, May 18, 2024

EC new rules : రాజ‌కీయ పార్టీల‌కు ఈసీ ఊర‌ట !

ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈసీ రాజ‌కీయ పార్టీల‌కు ఊర‌ట క‌ల‌గించే విష‌యం చెప్పింది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ప్ర‌స్తుతం ఎన్నికలున్న జ‌రగ‌నున్న‌ ఐదు రాష్ట్రాల్లో వెయ్యి మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి ఈసీ అనుమతించింది. ఇంటింటి ప్రచారంలో జనాల పరిమితిని పెంచింది. ఇంతకు ముందు ఇంటింటి ప్రచారంలో 10 మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 20కి పెంచింది. ఇండోర్​లో 500 మంది వ్యక్తులతో ఎన్నికల సభ నిర్వహించడానికి మినహాయింపు కల్పించింది ఈసీ. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దేశ‌వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావంతో ఈసీ రాజకీయ పార్టీల‌కు ఆంక్ష‌లు విధించ‌గా.. ఈప్ర‌స్తుతం ఆ ఆంక్ష‌ల‌కు కాస్త స‌డ‌లింపు ఇవ్వ‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement