Wednesday, May 1, 2024

తెలంగాణకు పొంచి ఉన్న భూకంపం ముప్పు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: మనకూ భూకంపం పొంచి ఉందన్న పుకార్లలో తెలంగాణ ప్రజలు తీవ్ర భయాం దోళనకు గురవుతున్నారు. ఇటీవల టర్కీ, సిరియాల్లో భూ కంపం సృష్టించిన విధ్వంసానికి ప్రపంచమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ భూకంపాన్ని ముందే గ్రహంచిన పరిశోధ కులు.. ఆ తర్వాత భూకంపాలు వచ్చే ప్రమాదమున్న దేశాలపై పరిశోధనలు సాగించారు. ఈ క్రమంలో వారు ఇండియాలో కూడా త్వరలోనే భూకంపం సంభవించే ప్రమాదముందని తేల్చారు. పరిశోధకులు చెప్పిట్టుగానే అప్పటి నుంచి భారత్‌ లోని పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా ఇది తెలుగు రాష్ట్రాలకూ పాకింది. ఆదివారం ఉద యం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. వారం రోజుల క్రితం నిజామాబాద్‌లోనూ స్వల్ప భూ ప్రకపంనలు సంభవించాయి. రెండు చోట్ల జరిగిన ఈ స్వల్ప ప్రకంపనలు భారీ విధ్వంసానికి సంకేతాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది. సుమారు 10 సెకన్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాం దోళనలకు గురయ్యారు. ఈ మండలాల్లో గతంలోనూ పలుమార్లు భూమి కంపించించి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా ప్రకంపనలు చోటుచేసుకు న్నాయి. మాదిపాడులోని జడేపల్లి తండా, కంచిబోడు తండా ల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం స్వల్వ వ్యవధిలో భారీ శబ్ధంతో రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

హైదరాబాద్‌లోనూ గతంలో భూప్రకంపనలు
రెండు దశాబ్దాల్లో పదమూడు కంటే ఎక్కువ సార్లు హదరాబాద్‌ పరిసరాల్లో భూప్రకంపనలు సంభవించాయని పలు భూభౌగోళిక అధ్యయనాల్లో వెల్లడైంది. టర్కీలో వరుస భూకంపాలు, ఉత్తర భారతంలో సంభవిస్తున్న భూకంపాలతో నగరంలోని స్థితిగతులను విశ్లేషించింది. నగరం నుంచి 35-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భౌగోళిక పరిస్థితులను ప్రత్యేక పరికరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిం చగా.. నగరంలోనూ భూప్రకంపనలు కలిగాయని, భూ ఉపరితలం నుంచి 28కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాలు నిక్షిప్తమై ఉన్నట్లుగా వెల్లడి కాగా, వాటి ప్రభావం నగర మౌలిక, భవనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైంది.

20 ఏండ్లలో 13 సార్లు..
భూ అంతర్భాగంలోని పొరల్లో ఏర్పడిన ఒత్తిడి కార ణంగా సాధారణ భూప్రకంపనలు సంభవించగా.. గడిచిన 20ఏళ్లలో 13 కంటే ఎక్కువ సార్లు భూకంప తరంగాలు వెలువ డినట్లుగా ఎన్జిఆర్‌ఐ తాజా విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా వికారాబాద్‌, జూబ్లిహల్స్‌, ఘట్‌కేసర్‌, ఇబ్రహంపట్నం ప్రాం తాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. నగరం చుట్టూరా 35-65 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలు ప్రాంతాల్లో సేకరించిన సిస్మోగ్రాఫిక్‌ డేటా ఆధారంగా భూకంపాలు సంభవించినట్లుగా నిర్ధారించారు.

నాలుగు పొరలపై విస్తరించిన హదరాబాద్‌ డెక్కన్‌ పీఠభూమి
ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం దాదాపు మూడు బిలియన్ల ఏండ్ల కిందట ఏర్పడిన ఆర్కియన్‌ క్రస్ట్‌ లక్షణాలను కలిగి ఉన్నట్లుగా భావిస్తారు. నాలుగు పొర లపై విస్తరించిన #హదరాబాద్‌ డెక్కన్‌ అగ్నిపర్వత కాలం నాటి ఆధారాలు ఉన్నట్లుగా ఎన్జిఆర్‌ఐ పరిశోధకులు వెల్లడించారు. అయితే దిగువన ఉండే పొరలు ఎగువన ఉండే దాని కంటే దట్టంగా విస్తరించి ఉన్నాయని తేలింది.
జూబ్లిహల్స్‌, రాజా పేట్‌, ఇబ్రహంపట్నం మధ్య ప్రాంతం లో పైభాగంలోని పొర మందం 5-10 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందని, ఇబ్రహంపట్నం నుంచి మహబూబ్‌ నగర్‌ వరకు ఉన్న ప్రాంతాల్లో గుర్తించిన మధ్య పొర మందం 47కిలోమీటర్లు, మూడో పొర మందం 6.112.5 కిలొ మీటర్లతో వికారాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌, జూబ్లిహల్స్‌ నుంచి ఘట్‌కేసర్‌ వర కు ఉండగా, చిట్టచివరి పొర మందం ఇబ్రహంపట్నం వద్ద 8.7 కిలోమీటర్లు ఉంటే, హత్నూర్‌ వద్ద 20.6 కిలోమీటర్లు లోతు వరకు భూమి పొరలు విస్తరించి ఉన్నాయి.

నాటి నుంచి నేటి వరకు ఎన్నో భౌగోళిక మార్పులు
నగరం చుట్టూరా పొరల మందంలో ఈ స్థాయిలో వ్యత్యాసాలను గుర్తించగా వీటన్నింటినీ క్రోడీకరించి తరం గాల వేగం, ఉత్పన్నమైన సాంద్రతలతో భూమి లోపల సంభ వించిన భూప్రకంపాలను విశ్లేషించారు. నగరం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో భౌగోళిక మార్పులు చోటు చేసుకు న్నాయి. 1843, 1876, 1982, 1993లలో సంభవించిన భూప్రకంపనలను అంచనా వేయగా.. తక్కువ తీవ్రతతో ఏర్పడినట్లుగా నిర్ధారించారు.
2022లో గచ్చిబౌలి ప్రాంతం లో సంభవించిన భూకంప తీవ్రత కూడా 3.34.8 మధ్యనే ఉంటుందని ఈ ఫలితాలను ఆధారంగా చేసుకొని సిటీ అభి వృద్ధికి అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టాలని ఎన్జిఆర్‌ఐ పరిశోధకులు సూచిస్తున్నారు. సూక్ష్మస్థాయి భూప్ర కంపనాలతో వచ్చే నష్టం కూడా ఉండదని, మౌలిక నిర్మాణా లపై ఏమాత్రం ప్రభావం చూపదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement