Friday, May 3, 2024

బాధ్య‌తాయుతంగా తాగండి – విస్కీని ప్ర‌మోష‌న్ చేస్తోన్న ప్ర‌గ్యా

అఖండ చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన ప్ర‌గ్యాజెశ్వాల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేయలేదు. అవకాశాలు లేకపోవడంతో తాజాగా ఈ బ్యూటీ.. ఓ ఫారెన్ బ్రాండ్ విస్కీ ప్రమోషన్లో పాల్గొంది. బ్లాక్ డ్రస్ ధరించి యమా హాట్ గా తయారైన ప్రగ్యా.. సదరు బ్రాండ్ విస్కీ బాటిల్ ముందు పెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై ఇందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చివరిలో మందుబాబులకు హెచ్చరిక కూడా జారీ చేసింది. బాధ్య‌తాయుతంగా తాగండి… 25ఏళ్లు పై బ‌డిన వారికి మాత్ర‌మే అంటూ ప్రగ్యా చెప్పుకొచ్చింది ..ఇంకేముంది ఆమెపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మద్యం బాటిల్ ని ప్రమోట్ చేసి.. మళ్లీ బాధ్యతాయుతంగా తాగమని నీతులు చెబుతున్నావా.. ఇలాంటి యాడ్ చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నావ్..? అంటూ ప్రగ్యాకు చివాట్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడీ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement