Sunday, May 5, 2024

Movie: మాజీ ప్ర‌ధాని నెహ్రూతో ‘గంగూబాయి’కి రిలేషన్ ఉందా? హైప్ క్రియోట్ చేస్తున్న ట్రైల‌ర్‌!

బాలివుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తున్న‘గంగూబాయి క‌తియావాడి’ సినిమా ట్రైల‌ర్ జ‌నాల్లో ఎంతో ఇంట్ర‌స్ట్‌ని క‌లిగిస్తోంది. అప్ప‌ట్లో ఆమె ప్ర‌సంగాలు యావ‌త్ దేశాన్ని ఆలోచింప‌జేశాయ‌ని, ఏకంగా దేశ ప్ర‌ధానిగా ఉన్న జ‌వ‌హ‌ర్‌లాల్‌ నెహ్రూ ఆమెను పిలిచి మాట్లాడార‌ని తెలుస్తోంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా రెడ్​ లైట్​ ఏరియాల పరిస్థితిని మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య‌నే గంగూబాయి సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్‌లో ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు మూవీ మేకర్స్‌. సంజ‌య్ లీలా బ‌న్సాలీ డైరెక్ట్ చేస్తున్న ఓ మాఫియా లీడ‌ర్‌, కామాటిపుర వేశ్య రియ‌ల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

ఈ కథ ఎస్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు. గంగూబాయి గూండాలను మాత్రమే కాకుండా, పెద్ద, పెద్ద పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ను కూడా ప్రభావితం చేసింది. మహిళా సాధికారత సదస్సు నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ గంగూబాయి వేశ్యలకు అనుకూలంగా త‌న ప్ర‌సంగాలు చేసింది.

ఆ త‌ర్వాత‌ దేశంలో రెడ్ లైట్ ఏరియాల పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరిగాయి. మహిళా సాధికారత శిఖరాగ్ర సమావేశంలో మహిళల సాధికారత గురించి గంగూబాయి ప్రసంగించింది. ఈ విష‌యం కాస్తా అప్ప‌టి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు చేరింది. ఆ త‌ర్వాత జవహర్‌లాల్ నెహ్రూను కలిసే అవకాశం గంగూబాయికి లభించింది. సెక్స్ వర్కర్ల పరిస్థితిని జాతీయ స్థాయిలో మెరుగుపరచాలనే అంశాన్ని తన ప్రసంగాల ద్వారా లేవనెత్తాలని నెహ్రూను ఆమె కోరింది.

- Advertisement -

ఈ సమాజంలోని ఇతర వ్యక్తులు పొందినట్లుగానే వేశ్యలు కూడా త‌మ‌ హక్కులు పొంది.. గౌరవప్రదంగా నడిపించేలా ఏదైనా చేయాలని గంగూబాయి కోరింది. అయితే.. గంగుబాయి పోరాట పటిమ మెచ్చిన నెహ్రూ బహుమతిగా ఓ పూలదండను బహుమతిగా ఇచ్చారని అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. తనను పెళ్లి చేసుకోవాలని నెహ్రూను గంగూబాయి కోరిందట. కాగా, గంగూబాయి సినిమా విడుదలైతే కానీ దీనికి సంబంధించిన‌ మరిన్ని విషయాలు తెలుస్తాయ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement