Friday, May 17, 2024

వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డిదే కీలక పాత్ర.. రక్షించేందుకు జగన్ ఢిల్లీ టూర్లు: బొండా ఉమా

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అందరూవిస్తుపోయే వాస్తవాలను ఛార్జ్ షీట్ లో నమోదు చేసిందన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నవ్యక్తి సీబీఐ విచారణనే తప్పు పడుతూ, సీబీఐ ఛార్జ్ షీట్ లో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేరును ఉదహరిస్తూ.. వివేకానందరెడ్డి హత్య జరగడానికి ప్రధాన కారణం కడప ఎంపీ టిక్కెట్ వివాదమేనని పేర్కొన్నట్లు చెప్పారు. ఆటిక్కెట్ అవినాశ్ రెడ్డికి ఇవ్వవద్దని వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వద్ద పట్టుపట్టాడని పేర్కొన్నారు. ఆ అక్కసుతోనే అవినాశ్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వివేకా మాజీడ్రైవర్ దస్తగిరితోకలిసి వివేకానందరెడ్డిని హతమార్పించాడని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొందని చెప్పారు.

ఈ హత్యకేసులో వివేకా నందరెడ్డివద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని జీర్ణించుకోలేకనే అవినాశ్ రెడ్డి ప్రోద్భలంతో దేవిరెడ్డి శంకర్ రెడ్డి హైకోర్ట్ ని ఆశ్రయించాడని ఆరోపించారు. హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచడం, ఢిల్లీ నుంచీ చౌరాసియా అనే ప్రత్యేకాధికారి పులివెందులకు రావడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని తెలిపారు. వివేకా హత్యోదంతంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ గతంలో కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, తరువాత దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నాడో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. హత్య చేయించిన వారిని కాపాడటానికే సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement