Sunday, December 8, 2024

Cricket Updtes: టెస్ట్ మ్యాచ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 345 ఆలౌట్‌

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 ప‌రుగుల‌కు ఆల్ అవుటైంది. ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (105) సెంచ‌రీ చేయ‌గా.. కివీస్ బౌల‌ర్ టిమ్ సౌథీ అయిదు వికెట్లు తీశాడు. 258 ప‌రుగులు వ‌ద్ద రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఇండియా.. కేవ‌లం 87 ర‌న్స్ జోడించింది.

లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో అశ్విన్ 38 ర‌న్స్ చేసి కొంత బెట‌ర్ అనిపించాడు. ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో శుభ‌మ‌న్ గిల్ 52, పుజారా 26, ర‌హానే 35, జ‌డేజా 50 ప‌రుగులు చేశారు. కివీస్ బౌల‌ర్ల‌లో జేమిస‌న్ 3, ప‌టేల్ 2 వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్ త‌న తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. 10 ఓవ‌ర్ల‌లో లాథ‌మ్‌, విల్ యోంగ్ క‌లిసి 23 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement