Friday, April 26, 2024

ఫ్యూచ‌ర్ అంతా ఈ-వెహికిల్స్ దే…

ప్ర‌భ‌న్యూస్ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో వాహనదారులపై భారం పడటం.. మరో వైపు వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యం పర్యావరణానికి సవాల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లిలో వాయు కాలుష్యంతో వాహనాలను ఆంక్షలు విధింంచిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలిక్ట్రిక్‌ వాహనాలను 2030 నాటికి పూర్థి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వినియోగం తగ్గించాలన్నది సర్కార్‌ యోచన. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ప్రజలు మొగ్గు చూపేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సూచనలు చేసింది. చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం 70 శాతం సబ్సీడి ఇవ్వగా.. మిగతా 30 శాతం చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే సంబంధి సంస్థ భరించాల్సి ఉంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్‌ స్టేషన్లు 500 వరకు ఏర్పాటు చేయనున్నారు. అందులో ఒక హైదరాబాద్‌లోనే 118, కరీంనగర్‌ -10, వరంగల్‌-10 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు చెపట్టారు. ఈ చార్జింగ్‌ కేంద్రాలనుప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఏర్పాటు చేసి.. వాహనాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చార్జింగ్‌ స్టేషన్లకు స్థలం ఇవ్వాల్సి ఉంటుంది.

చాల మంది వినియోగదారులు విద్యుత్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణీత కీలోమీటర్లు మాత్రమే వాహనం ప్రయాణిస్తుంది. చార్జింగ్‌ అయిపోతే తిరిగి ఇంధనం వినియోగించాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్‌ చేసే చోటే ఈ స్టేషన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే 100 ప్రాంతాలను గుర్తించగా.. అందులో ఇందిరాపార్కు, కేబీఆర్‌ పార్కు గేట్‌ -1, కేబీఆర్‌ పార్కు గేట్‌-3, కేబీఆర్‌ పార్కు గేట్‌ -6, ట్యాంక్‌బండ్‌ రోడ్‌, బషీర్‌బాగ్‌ రోడు, గన్‌ ఫౌండ్రీ, మున్సిపల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ అబిడ్స్‌, నానక్‌రామ్‌గూడ, మహవీర్‌ హరిన వనస్థలి జాతీయ పార్కు, శిల్పారామం టూ నాగోల్‌ బ్రిడ్జి, ఉప్పల్‌, ఓవైసీ ఆసుపత్రి, తాజ్‌ త్రీ స్టార్‌ హోటల్‌ ప్రాంతాల్లో పనులు సాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement