Saturday, April 27, 2024

కొవిన్ యాప్లో కొత్త ఫీచర్… ఏంటో తెలుసా?

కరోనా వ్యాక్సిన్ లభ్యత, పంపిణీకి సంబంధించిన వివరాల విషయంలో కొవిన్ మొబైల్ యాప్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. వ్యాక్సిన్ డోసుల నిల్వను డిజిటల్‌ గా ట్రాక్‌ చేయడంతో పాటు టీకా లభ్యత, సేకరణకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొవిన్ యాప్‌ లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ఆరోగ్యశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఓ సెక్యూరిటీ కోడ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌ కు నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. వ్యాక్సినేషన్ సమయంలో అది చెబితేనే టీకా వేస్తారు. లేదంటే లేదు. సెక్యూరిటీ పరమైన లోపాలతోపాటు వ్యాక్సిన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ సరికొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

 కొవిన్ యాప్‌ లో రిజిస్ట్రేషన్ కొంత గందరగోళంతో ఏర్పడుతోంది. లబ్ధిదారులకు సరైన పరిజ్ఞానం లేకపోవడంతో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. మరికొందరు స్లాట్ బుక్ చేసుకున్నా సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లకపోవడంతో వ్యాక్సిన్ వేయించుకున్నట్టు మెసేజ్ వస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఈ సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

కాగా, దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని, అందుకుగాను రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది కేంద్రం. కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. మే 1 నుంచి టీకా కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. అయితే, ఒక్కసారిగా లక్షలాది మంది వెబ్ సైట్ ను తెరవడంతో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆపై రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, గంటల వ్యవధిలో కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

ఇదీ చదవండి: బాబోయ్ అంబులెన్స్.. దడ పుట్టిస్తున్న చార్జీలు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement