Sunday, April 28, 2024

‘యశ్’ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అవ్వలేదా ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటం తో పాటు కలెక్షన్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్2 తెరకెక్కుతోంది.

ఇదిలా ఉండగా యశ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కొన్ని వార్తలు ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే అసలు విషయంలోకి వెళితేమ్.. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అవ్వలేదట. ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల సమస్య తలెత్తిందని తెలుస్తోంది. దీంతో ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు గా రూమర్స్ వచ్చాయని కానీ అందులో నిజం లేదని క్లారిటీ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement