Monday, April 29, 2024

బాబోయ్ అంబులెన్స్.. దడ పుట్టిస్తున్న చార్జీలు

దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కరోనా రోగులను కుటుంబసభ్యులు తమ సొంత వాహనాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఆటోలు, క్యాబ్‌ లు.. ఆస్పత్రుల పేరు చెబితే అటువైపుగా కూడా రావడంలేదు. ఇక, ఉచిత అంబులెన్స్‌ సర్వీసులు ప్రభుత్వ ఆస్పత్రులకు తప్ప.. ప్రైవేటుకు రాలేమని చెబుతున్నారు. దీంతో ఈ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు అంబులెన్స్‌ సర్వీసుల నిర్వాహకులు  మూడింతలకు పైగా ఛార్జీలను పెంచారు. దీంతో మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌ సర్వీసు కోసం ఫోన్‌ చేస్తే.. చెప్పిన ధరకు అంగీకరిస్తే సరే.. లేదంటే వచ్చే పరిస్థితి లేదు. ఏ మాత్రం బేరమాడినా.. ఈ లోపు ఎక్కడైనా ఆర్డర్‌ వస్తే అక్కడికే అంబులెన్స్‌ ను పంపుతున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఉన్న అంబులెన్స్‌ సర్వీసులైతే ఏకంగా సిండికేట్‌గా మారాయి. విధిలేక అంబులెన్స్‌ లకు అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజాగా కరోనా బాధితుడిని గుర్గావ్ నుంచి పంజాబ్ లోని లుథియానాలోని ఆస్పత్రికికి తీసుకెళ్లేందుకు ఏకంగా లక్షా 20 వేల బిల్లు వేశారు అంబులెన్స్ నిర్వహకులు. గుర్గావ్ నుంచి లుథియానాకు 350 కిలో మీటర్ల దూరానికి రూ. 1.20 లక్షలు వసూలు చేశారు. కరోనాతో బాధపడుతున్న 52 ఏళ్ల వ్యక్తిని ఆక్సిజన్ కొరత కారణంగా గుర్గావ్ లోని ఆస్పత్రిని తరలించేందుకు అంబులెన్స్ నిర్వహకులు డబ్బులు వసూలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement