Tuesday, May 7, 2024

24గంట‌ల్లో కొత్త‌గా – 11,793 క‌రోనా కేసులు

గ‌డిచిన 24గంట‌ల్లో కొత్త‌గా 11,793క‌రోనా కేసులు న‌మోద‌యిన‌ట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా వైరస్‌ కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, నిన్నటితో పోలిస్తే తాజా కేసులు కాస్త తగ్గుముఖం పట్టగా.. 24 గంటల్లో 9,486 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిసి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,34,18,839కు పెరిగింది. 4,27,87,092 మంది కోలుకున్నారు.వైరస్‌తో 5,25,047 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 96,700 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.57శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.21శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం దేశవ్యాప్తంగా 4,73,717 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) తెలిపింది. ఇప్పటి వరకు 86,14,89,40 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 1,97,31,43,196 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement