Thursday, May 9, 2024

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో చేదు అనుభవం.. ఎగరక ముందే కిందపడ్డ పార్టీ జెండా

కాంగ్రెస్‌ పార్టీ 137వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ వేడుక‌లలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో కాంగ్రెస్‌ పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ జెండా ఎగ‌రేస్తోన్న స‌మ‌యంలో అది స‌రిగ్గా ఎగ‌ర‌లేదు. ఒక్కసారిగా జెండా కాస్తా కిందకు పడిపోయింది. జెండా ఎగరకుండానే నేరుగా సోనియా చేతుల్లో పడింది. దీంతో ఆ జెండాను మ‌ళ్లీ తాడుకి క‌ట్టి ఎగ‌రేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement