Tuesday, May 21, 2024

ట్రెండ్ అవుతున్న జెనీలియా, స‌ల్మాన్ ల డ్యాన్స్ వీడియో

హీరోయిన్ జెనీలియా , బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. స‌ల్మాన్ ఖాన్ త‌న కుటుంబంతో క‌లిసి ప‌న్వెల్ ఫామ్ హౌస్ లో త‌న 56వ పుట్టిన‌రోజుని జ‌రిపారు. కాగా స‌ల్మాన్ ఖాన్ పాము కాటుకు గురైన రెండు రోజుల త‌ర్వాత జెనీలియా ఆయ‌నకి విషెష్ తెలిపింది. ఈ మేర‌కు ఓ వీడియోని పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో ఒక పార్టీలో స‌ల్మాన్ తో క‌లిసి జెనీలియా డ్యాన్స్ చేస్తున్న‌ట్లు ఉంది. ఈ వీడియోలో వారిద్ద‌రు రెడ్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ లో మెరిశారు. ఈ మేర‌కు ఓ క్యాప్షన్ పెట్టింది. “అతి పెద్ద హృదయం ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని సంతోషం, ప్రేమ, గొప్ప ఆరోగ్యంతో ఆశీర్వదిస్తాడు. మేం నిన్ను ప్రేమిస్తున్నాం – ఆజ్ భాయ్ కా పుట్టినరోజు హై.ష అని తెలిపింది.జెనీలియా, సల్మాన్‌ ఖాన్‌లు ఉన్న వీడియో సోమవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement