Wednesday, May 8, 2024

Rainfall: దక్షిణ అండమాన్ లో అల్పపీడనం.. తుఫానుగా మారే అవకాశం

దక్షిణ అండమాన్ లో కొనసాగుతున్న అల్పపీడనం బలపడింది. ఆదివారం ఉదయం నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వచ్చే 6 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా అల్పపీడనం మారనుంది. ఇది మరింత బలపడి వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఈ నెల 10 నాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరానికి చేరుతుందని తెలిపింది. ఈ నెల 10 లేదా 11న విశాఖపట్టణం, భువనేశ్వర్ మధ్య నేలను తాకుతుందని పేర్కొంది. ఊహించినదానికన్నా అల్పపీడనం వేగంగా కదులుతోందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా ఒడిశా తీరప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, మే 8న తుపానుగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఆ తర్వాత తుఫాను వాయువ్య దిశగా పయనించి మే 10న ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement