Monday, May 20, 2024

టాలీవుడ్ చంద‌మామ – లేటెస్ట్ ఫొటోలో అదిరిన కాజ‌ల్

టాలీవుడ్ చంద్ర‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ లేటెస్ట్ గా ఓ ఫొటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజ‌ల్.. తన బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టింది. మరోవైపు డెలివరీ అయన తర్వాత ఆమె తన తొలి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బిడ్డకు తల్లి అయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పే విధంగా ఆమె ఫొటో ఉంది. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందనే వార్తలు వ‌చ్చాయి. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ పూర్తి సమయాన్ని కుటుంబానికే వెచ్చించాలనే యోచనలో కాజల్ ఉన్నట్టు సమాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement