Saturday, April 27, 2024

యోగి కేబినెట్ లో ‘ముస్లీం’కి చోటు

యూపీలో యోగి ఆదిత్య‌నాథ్ వ‌రుస‌గా రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. కాగా యోగి కేబినెట్ లో ఒక ముస్లింకి కూడా బెర్త్ ద‌క్క‌డం విశేషం. డానిష్ అజాద్ అన్సారీకి మంత్రిగా అవ‌కాశం వ‌చ్చింది.కాగా 37 ఏళ్లుగా యూపీకి రెండోసారి సీఎం అయిన వారు లేరు. ఈ రికార్డును యోగి బద్దలు కొట్టారు. అంతేకాదు, కొత్త కేబినెట్ తో యోగి దాదాపు రెండు గంటల పాటు సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు యోగితో పాటు మరో 52 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియంలో యోగి ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement