Friday, April 19, 2024

Flash: నేటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్

బ్యాంకు వినియోగదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులు శనివారం నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా మూతపడనున్నాయి. మొదటి రెండు సెలవులు కాగా, రెండో రెండు కార్మిక సంఘాల జాతీయ సమ్మె కారణంగా సెలవులు ఉంటాయి. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన జాతీయ సమ్మెలో పాల్గొనాలని బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌లు నిర్ణయించాయి.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ఈ నెల 28 నుంచి 29 వరకు రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు పలు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(ఏఐబీవోఏ) ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి. ఈ రోజు నాలుగో శనివారం, రేపు ఆదివారం, ఆ తర్వాత రెండు రోజులు సమ్మె నిర్ణయం. దీంతో బ్యాంకింగ్‌ సేవలు వరుసగా నాలుగు రోజులు కస్టమర్లకు దూరమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement