Wednesday, May 8, 2024

Miracle Accident: చావు నుంచి త‌ప్పించుకున్న బుడ్డోడు.. ఏం జరిగిందంటే..

ప్రమాదాలు, మృత్యువు ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. దూసుకొచ్చిన చావు నుంచి తప్పించుకోవడం మాములు విషయం కాదు. అయితే ఓ బాలువు తృటిలో చావు నుంచి త‌ప్పించుకున్నాడు. ప్రమాదం నుంచి బాలుడు అదృష్ట‌వ‌శాత్తు తప్పించుకోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. కేర‌ళ రాష్ట్రంలోని క‌న్నూరు జిల్లాలోని చోరుక్క‌ల గ్రామం వ‌ద్ద 8 ఏళ్ల బాలుడు త‌న సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు. సైకిల్ అదుపుత‌ప్పి ప్ర‌ధాన ర‌హ‌దారిపైకి దూసుకెళ్లింది. దీంతో సైకిల్‌ను మొద‌ట బైక్ ఢీకొట్టింది. సైకిల్‌పై ఉన్న బాలుడు కింద‌ప‌డిపోయాడు. అంత‌లోనే దూసుకొచ్చిన బ‌స్సు సైకిల్ పైనుంచి దూసుకెళ్లింది. అయితే, బాలుడు రోడ్డుకు అవ‌తలి వైపు ప‌డిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. సైకిల్ నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటన అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు న‌మోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement