Saturday, April 27, 2024

తమిళనాడు సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసంలో సమావేశమయ్యారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు.
ఈ భేటీలో జాతీయ రాజకీయపరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. చెన్నైలోనే ఉన్న రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్​ను కూడా కేసీఆర్ కలవనున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement