Sunday, May 5, 2024

శేఖ‌ర్ మాస్ట‌ర్ నిర్మాణంలో వెబ్ సిరీస్

వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నాడు కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్. ఒవైపు సినిమాలే కాకుండా , ప‌లు డ్యాన్స్ షోల‌కి జ‌డ్జిగా ఉన్నాడు. శేఖ‌ర్ స్టూడియోస్ అంటూ యూట్యూబ్ ఛాన‌ల్ ని పెట్టారు. ఈ ఛాన‌ల్ ద్వారానే ‘టెర్రేస్ లవ్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. సత్య కృష్ణ దర్శకత్వంలో వెబ్ సిరీస్ తెరకెక్కింది. శేఖర్ మాస్టర్ సతీమణి శిరీష ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. తమ శేఖర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో తొలిసారి ‘టెర్రేస్ లవ్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ చేశామన్నారు. ఈ వెబ్ సిరీస్ ను అందరూ చూసి తమను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు. ఈ వెబ్ సిరీస్ లో అనుపమ్ చెర్రీ, సంయూరెడ్డి ప్రధాన పాత్రలను పోషించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement