Tuesday, May 14, 2024

Boycott Pushpa: ‘పుష్ప’ సినిమాకు సెగ.. ఇంతకీ కారణం ఏంటంటే?

స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్​ తాజా సినిమా ‘పుష్ప’ విడుదలకు ముందే నిరసన సెగ తగిలింది. పుష్ప సినిమా రేపు(డిసెంబర్ 17) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు కర్ణాటకలో సోషల్ ​మీడియా సెగ తగిలింది. ట్విట్టర్​లో #BoycottPushpaKarnataka హ్యాష్​ ట్యాగ్​తో ట్రెండింగ్​ చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ ఐదు భాషల్లో విడుదల కానుంది. అయితే, కర్ణాటకలో కన్నడ వెర్షన్​ కన్నా తెలుగు వెర్షన్​ను ఎక్కువ షోలు ప్రదర్శించనున్నారు. దీంతో కన్నడిగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కర్ణాటకలో బాయ్​ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.

https://twitter.com/Suresh96380427/status/1471378800814424065
Advertisement

తాజా వార్తలు

Advertisement