Friday, April 26, 2024

Breaking : పుష్ప తెలంగాణ‌లో ‘ఐదు’ షోలు : డిసెంబ‌ర్ 30వ‌ర‌కు అనుమ‌తి

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. రెండు భాగాలుగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కాగా పుష్ప చిత్రం ఐదు షోల‌కి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. ఈ నెల 30వ‌ర‌కు ఐదుషోల‌కు అనుమ‌తిని ఇచ్చారు. ఈ చిత్రం రేపు డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ఐదు షోల‌కి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తినివ్వ‌డం బ‌న్నీ ఫ్యాన్స్ కి శుభ‌వార్తే. కాగా ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. అన‌సూయ‌,సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ లో న‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement