Wednesday, May 15, 2024

ఆంధ్రప్రభ విలేకరిపై ఎంపిపి దుర్భాషలు,బెదిరింపులు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరుగుతున్న పంచాయతీ కార్యదర్శుల అక్రమ బదిలీలపై ఆంధ్రప్రభ దినపత్రిక ”కాసుల కత్తి కార్యదర్శుల మెడలో…!” అనే శీర్షికను గురువారం జిల్లా టాబ్లాయిడ్ లో కథనం ప్రచురితం అయిన విషయం విధితమే. అయితే ఈ కథనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారి సంచలనం సృష్టించింది. నిజాలు నిగ్గు తేల్చే విధంగా ఆంధ్రప్రభ అక్షర పోరాటం చేస్తుంటే చెన్నారావుపేట మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపిపి విజేందర్ జీర్ణించుకోలేకపోతున్నారు. బాధితుల మనోగతాన్ని బయటపెట్టిన ప్రభన్యూస్ విలేకరిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కార్యాలయానికి వస్తూనే విలేకరిపై తన అక్కసు వెళ్లగక్కారు. వార్తలో లోపాలు ఉంటే భావస్వేచ్చ ప్రకారం ఖండించాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా సదరు విలేకరిపై ఓ ప్రజాప్రతినిధిని అని మరచి నానా దుర్భాషలాడారు. పలువురు ఎంపిపిని సముధాయించే ప్రయత్నం చేశారు. అయితే, ఇటీవల కాలంలో పలువురు రాసిన కథనాలు ప్రస్తావిస్తూ మీడియా వ్యవస్థపై తిట్లతో దుమ్మెత్తిపోశారు. కులం సంభదించినా అంశాలను ప్రస్తావిస్తూ పలువురు పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా ఆ వార్త రాసిన సదరు విలేకరిని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎంపీపీ తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న ఎంపిపిపై చర్యలు తీసుకుని స్థానిక జర్నలిస్టులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement