Wednesday, May 8, 2024

రూమ‌ర్స్ కి చెక్ – వారు నా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్ల‌లు – పూన‌మ్ కౌర్

త‌న‌పై వ‌స్తోన్న కామెంట్స్..ట్రోల్స్ పై స్పందించింది న‌టి పూన‌మ్ కౌర్. ఫొటోలో ఉన్నఇద్ద‌రు పిల్ల‌లు త‌న బెస్ట్ ఫ్రెండ్ కూతుర్ల‌ని వెల్ల‌డించింది. భ‌రించ‌లేనంత న‌ష్టం జ‌రిగింది చాలు..వీళ్లిద్ద‌రు నా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్ల‌లు. పుకార్ల‌కు క్లారిటీ ఇచ్చి..న‌న్ను ఊపిరి పీల్చుకునేలా చేసిన సోష‌ల్ మీడియాకు కృతజ్ఞురాలిని అంటూ ట్వీట్ చేసింది పూన‌మ్ కౌర్‌. ప్ర‌స్తుతం తెలుగులో నాతిచ‌రామి సినిమాలో న‌టిస్తోంది పూన‌మ్ కౌర్‌. కాగా రీసెంట్ గా ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఒడిలో పెట్టుకుని చాలా హ్యాపీమూడ్‌లో దిగిన స్టిల్‌ను పూన‌మ్ కౌర్ ట్విట‌ర్లో పోస్ట్ చేసింది. ఆ ఇద్ద‌రూ పూన‌మ్ కౌర్ కూతుళ్లు కావొచ్చ‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూన‌మ్..ర‌హ‌స్యంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ పోస్ట్ చేశారు. దీనిపై అంద‌రికీ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement