Monday, April 29, 2024

Hyd: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న‌ హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్‌ పైనుంచి అతడు దూకేయడంతో పెద్దశబ్ధం వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వచ్చి చూసేసరికి శ్రీధర్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. శ్రీధర్ అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement