Monday, April 29, 2024

COVID-19: హోమ్ ఐసోలేషన్ 7 రోజులే.. క‌రోనాపై కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

భారత్ లో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఏకండా 58 వేల పైచిలుకు కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో థర్డ్ వేవ్ రాబోతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసల పెరుదలతో చాలా రాష్ట్రాలు కఠినం నైట్ క‌ర్ఫ్యూలు అమ‌లు చేస్తున్నారు. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుదల చేసింది. హోమ్ ఐసోలేష‌న్‌ను 10 రోజుల‌కు బ‌దులుగా ఏడు రోజుల‌కు కుదించింది. వ‌ర‌స‌గా మూడు రోజుల‌పాటు జ్వ‌రం రాకుండా ఉంటే 7 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే స‌రిపోతుంద‌ని కేంద్రం పేర్కొన్న‌ది.   బాధితులు మాస్కులు ధరించాలని తెలిపింది. హోమ్ ఐసోలేషన్ వ్యవధి ముగిసిన తర్వాత మళ్లీ కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.

హోమ్ ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తికి తేలికపాటి లక్షణాలు ఉన్నా.. ఎలాంటి జ్వరం ఉండకూడదు. బాధితుల ఆక్సిజన్‌ స్థాయి 93 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు అయితే వారు స్వీయ నిర్బంధానికి అర్హులు. అయితే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి దగ్గరలోని ప్రభుత్వ వైద్యాధికారి ధ్రువీకరిణ (తేలికపాటి లక్షణాలు ఉన్నాయని) పత్రం తీసుకోవాలి. ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తితో పాటు కుటుంబం క్వారంటైన్​ నిబంధనలు పాటించాలి. సదరు వ్యక్తికి కొవిడ్​-19 వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయి ఉండాలి. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగస్థులు.. సంబంధిత మెడికల్ అధికారి సలహా మేరకే హోం ఐసోలేషన్​లో ఉండాలి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి లక్షణాలు తీవ్రమవుతుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎప్పటికపుడు గోరు వెచ్చని నీటిని పుక్కిలించాలి. రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి. ట్యాబ్లెట్లకు జ్వరం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement