Wednesday, May 1, 2024

ఇంటర్‌ పరీక్ష ఫీజు తేదీలు ఖరారు.. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ అవకాశం

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజుల తేదీలను ఇంటర్‌ బోర్డు ఖరారు చేసింది. ఈనెల 5 నుంచి 24 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తూ మంగళవారం బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలస్య రుసుములతో ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.

గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే అవకాశాన్ని సైతం కల్పించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement