Sunday, June 13, 2021

భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలు

లాక్ డౌన్ ఎఫెక్ట్ నిర్మాణ రంగంపై పడింది. సిమెంట్, స్టీల్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడిందన్న సాకుతో ఉత్పత్తి దారులు ధలను అమాంతం పెంచేశారు. దీంతో ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో నిర్మాణరంగం కుదేలవుతోంది. ఇతర సామాగ్రి ధరలు చుక్కలనంటుతుండడం, సిమెంట్, స్టీల్ ధరలు ఏడాదిలో 60 నుంచి 80 శాతం పెరగడం.. ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కొత్త నిర్మాణాల సంగతి పక్కన బెడితే… నిలిచిపోయిన నిర్మాణాలను కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. గత నాలుగైదేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరల పెరుగుదల ఎప్పుడూ లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ స్థితిలో రోజువారి విక్రయాలు నాలుగోవంతుకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు నిర్మాణాలు 15 నుంచి 25 శాతమే జరుగుతున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News