Friday, April 19, 2024

పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ ను ఇలా లింక్ చేసుకోవచ్చు…

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్త రూల్స్ వచ్చాయి. ఈపీఎఫ్‌తో ఆధార్ లింక్ చేసుకోకపోతే సంస్థ చెల్లించే యాజమాన్యపు వాటా రాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి ఆధార్ కార్డు నెంబర్‌ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అది ఎలా అంటే..!

-పీఎప్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
-ఆతరవాత (యుఏ ఎన్) నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ కావాలి.
-మేనేజ్ ఆప్షన్‌లోకి వెళ్లి, క్లిక్ చేయాలి.
-తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో KYC ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
-ఆ తర్వాత అందులో ఉండే ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
-ఆధార్ నెంబర్‌ను, పేరును ఎంటర్ చేయాలి.
-సేవ్ చేసిన తర్వాత వివరాలను సరి చూసుకోండి.
-మీరు ఇచ్చిన వివరాలు UIDAI డేటాతో క్రాస్ చెక్ చేసిన అనంతరం అప్రూవ్ అవుతుంది.
-అనంతరం వెరిఫైడ్ అని మెసేజ్ వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement