Saturday, April 20, 2024

సమంత కోసం మరో వెబ్ సిరీస్ ?

అక్కినేని సమంత ఇటీవల డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మాన్2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే లేట్ గా అడుగుపెట్టినా పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. గతంలో కొన్ని ఆఫర్స్ వచ్చినా సమంత ఓకే చెప్పలేదు. కానీ నీ ఫ్యామిలీ మాన్2 కు మాత్రం ఓకే చెప్పింది. అంతే కాదు ఆ పాత్రకు సమంత సంపూర్ణ న్యాయం చేసింది. కాగా ఇప్పుడు సమంతకు ఆ వెబ్ సిరీస్ కెరీర్ పరంగా ఓ పెద్ద ప్లస్ గా నిలిచింది.

ఇప్పుడు సమంత కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సమంత తో భారీ స్థాయిలో మూడు భాషల్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే సమంత తో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ విన్న తర్వాత సమంత అంగీకారం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి సమంత ఆ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement