Saturday, April 27, 2024

చెరుకు రసం ఆశ చూపి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి..

జెండర్ తో పనిలేనట్టు కామోన్మాదులు రెచ్చిపోతున్నారు. స్కూలుకు వెళ్లొస్తున్నబాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అదే జిల్లాలో 20 ఏళ్ల యువకుడిని మరో వ్యక్తి రేప్ చేసి గాయపర్చిన ఉదంతం చోటుచేసుకుంది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. వారం కిందట బెల్గాం జిల్లాలో 24 ఏళ్ల యువకుడిపై మరోకడు దారుణానికి ఒడిగట్టాడు.

పుత్తూరులో..

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కబాక గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చినప్పుడు భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద అంటిఉండటంతో అతని తండ్రి కంగారుపడ్డాడు. ఏం జరిగిందని అడగ్గా, ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు.


అదే గ్రామానికి చెందిన మహ్మద్ హనీఫ్ తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు వాకింగ్ కోసం బయటికెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ పలకరించాడు. తెలిసినవాడే కదాని యువకుడు కూడా మాట కలిపాడు. వాకింగ్ చేస్తున్నావుగా, చెరుకు రసం తాగిస్తానంటూ నమ్మబలికిన హనీఫ్.. ఆ నెపంతో చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి రేప్ చేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు హనీఫ్ పై రేప్ కేసు పెట్టి అరెస్టు చేశారు.

బెల్గాం జిల్లాలో మరో ఘటన..

- Advertisement -

బెల్గాం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడు అంతాని తాలూకా సంకొనట్టి గ్రామంలోని తన సోదరి ఇంట్లో ఉంటూ బస్టాండ్ వద్ద ఓ హోటల్ లో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న పని ముగించుకుని బస్సు కోసం ఎదురుచూస్తున్న అతనికి.. గ్రామానికి చెందిన మరో వ్యక్తి తారాసపడ్డాడు. అక్క తొందరగా పిలుచుకురమ్మందంటూ బైక్ మీద తీసుకెళ్లాడా వ్యక్తి. తీరా ఊరికి కాకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఎలాగోలా ధైర్యం చేసిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో నిందితుడు రాజును పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి..శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

Advertisement

తాజా వార్తలు

Advertisement