Sunday, May 5, 2024

ఉక్రెయిన్‌లో రాయబార కార్యాలయాన్ని- రీఓపెన్ చేయ‌నున్న కెన‌డా

ఒట్టావా – ఉక్రెయిన్‌లోని దేశ రాయబార కార్యాలయాన్ని త్వరలో తిరిగి ప్రారంభించనున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. రాబోయే కొద్ది రోజులు లేదా వారాల్లో కార్యాల‌యాన్ని ప్రారంబించ‌డ‌మే తన లక్ష్యమని జోలీ సెనేట్ ఫారిన్ అఫైర్స్ .. ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిటీలో తెలిపారు. “కార్మికులకు సురక్షితమైన వాతావరణం ఉందని మేము నిర్ధారించుకోవాలి” అని జోలీ చెప్పారు. మా ఇతర ఫైవ్ ఐస్ సహోద్యోగులు.. భాగస్వాములు ఏమి చేస్తున్నారో కూడా మేం చూస్తున్నామ‌న్నారు.
ఫిబ్రవరి 12న, కీవ్‌లోని కెనడా రాయబార కార్యాలయం మూసివేయబడింది.. దౌత్య సిబ్బందిని పశ్చిమ నగరమైన ఎల్వివ్‌కు తరలించారు. తరువాత, మొత్తం సిబ్బంది పోలాండ్‌కు మార్చబడ్డారు. ఉక్రెయిన్‌లో UK తన ఆన్-ది-గ్రౌండ్ దౌత్యాన్ని పునఃప్రారంభించనున్నట్లు బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గత వారం ప్రకటించారు. ఇలాంటి ప్రతిపాదనలను యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ ,, ఇటలీ ప్రకటించాయి.కెనడియన్ ప్రభుత్వం ఇప్పుడు దీనిని అనుసరించడానికి ఒత్తిడిని పెంచింది. ఉక్రెయిన్‌లోని కెనడా రాయబారి లారిసా గలాడ్జాతో ఈ విషయాన్ని చర్చించినట్లు జోలీ తెలిపారు.రష్యాలో కెనడా మాజీ రాయబారి జెరెమీ కిన్స్‌మన్, కెనడా తన దౌత్య మిషన్‌ను ఉక్రెయిన్ నుండి ఎప్పటికీ తరలించి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు ముప్పును కెనడా ఎంత సీరియస్‌గా తీసుకోవాలో సెనేటర్లు జోలీకి ఒత్తిడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement