Friday, May 3, 2024

బీఎస్ ఎఫ్ జ‌వాన్ల క‌ష్టాలు.. ట్వీట్ చేసిన అధికారులు

ప‌గ‌లు..రాత్రి తేడా లేకుండా శ‌త్రువు క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్టుకుంటూ స‌రిహ‌ద్దుల్లో కాప‌లా కాస్తున్నారు జ‌వాన్లు..వారి వ‌ల్లే మ‌నం ఏ భయమూ లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కానీ మనం హాయిగా జీవనం గడపడం కోసం వాళ్లు ఎన్ని కష్టాలు పడతారో తెలుసా.. ఎన్ని సాహసాలు చేయాల్సి వస్తుందో ఎప్పుడైనా చూశారా.. కింది వీడియో చూడండి.. మన బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)కు చెందిన జవాన్‌లు కశ్మీర్‌ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ కాస్తున్నారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా, జారుతున్న మంచు కొండలపై పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. మోకాళ్ల లోతు దిగబడుతున్న మంచులో మన జవాన్‌లు సాహసం చేస్తుండగా తీసిన వీడియోను బీఎస్‌ఎఫ్‌ వర్గాలు ట్విటర్‌లో పోస్టు చేశాయి.ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు జ‌వాన్ల‌కి సెల్యూట్ చేయాల్సిందే అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement