Tuesday, April 23, 2024

ముంబై ఎయిర్‎పోర్ట్‎లో రూ.47.25కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ముంబై ఎయిర్‎పోర్ట్‎లో భారీగా నిషేధిత డ్రగ్స్ పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.47.25 కోట్ల విలువైన ఆరు కేజీల హెరాయిన్ తో పాటు కొకైన్ సీజ్ చేశారు. ఆఫ్రికా నుంచి వేర్వేరు విమానాల ద్వారా ముంబైకి తరలించినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికుల వద్ద డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement